Kondapalli Srinivas : అమరావతి : రాష్ట్రంలో 50-59 వయసు మధ్య ఉన్న వారు 11,98,501 మంది పింఛన్ పొందుతున్నారని, ప్రతి నెలా ఒకటో తేదీన గౌరవప్రదంగా పేదలకు పింఛన్లు ఇస్తున్నామని సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) తెలిపారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో చర్చ సందర్భంగా సభ్యుల అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులకు ఎక్కడా పింఛన్లు తొలగించ లేదని, వృద్ధులకు ఇచ్చే పింఛన్లను 3 వేల నుంచి 4 వేలకు ఒకేసారి పెంచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. భర్త చనిపోయిన మహిళలకు మరుసటి నెలలోనే స్పౌజ్ పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
Kondapalli Srinivas Comments
గత ప్రభుత్వంలో ఎవరైనా పింఛన్ దారుడు అత్యవసర పరిస్థితులలో పింఛన్ పంపిణీ సమయములో తన ఊరి నుండి బయటకు వెళ్లినప్పుడు, ఆ నెల పింఛన్ అమౌంట్ ను తిరిగి చెల్లించే వారు కాదన్నారు. కానీ తాము వచ్చాక దానిని తీసి వేశామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ . మూడు నెలల పింఛన్ అమౌంట్ ను ఒకే సారి తీసుకొనే విధంగా ఛాన్స్ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 8,63,216 పింఛన్ దారులకు 731.17 కోట్ల అమౌంట్ ను చెల్లించడం జరిగినదని చెప్పారు. నవంబర్ 2024 నుండి ప్రతినెలా స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతోందన్నారు. పించన్ దారుడు మరణించినప్పుడు అతని భార్యకు మరుసటి నెల నుండి పెన్షన్ మంజూరు చేస్తున్నామన్నారు. 2019 మే నెల నుండి కూడా స్పౌజ్ పెన్షన్లకు అర్హత కల్గి పెన్షన్ మంజూరు కాని వారికి కూడా ఆగస్టు 2025 లో కొత్తగా పెన్షన్ మంజూరు చేయడం జరిగినదని చెప్పారు. స్పౌజ్ పెన్షన్ల క్రింద ఇప్పటి వరకు 1,59,317 మందికి పెన్షన్లు ఇచ్చామన్నారు.
Also Read : MP Gurumurthy Strong Demand : రొయ్య రైతులను ఆదుకుంటాం : కేంద్రం

















