KL Rahul : ముంబై : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ దక్షిణాఫ్రికాతో ఆడే వన్డే సీరీస్ కు భారత జట్టును ఖరారు చేశాడు. జట్టుకు స్కిప్పర్ గా కేఎల్ రాహుల్ (KL Rahul) ను నియమించారు. స్కిప్పర్ గా ఉన్న శుభ్ మన్ గిల్ , శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో రాహుల్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మెన్ ఇన్ బ్లూ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నవంబర్ 30 నుండి దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కొనసాగుతుంది . భారత వన్డే కెప్టెన్ గిల్ కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ సందర్భంగా గాయపడ్డాడు. కోల్‌కతా టెస్ట్ 2వ రోజు తర్వాత గిల్‌ను ఆసుపత్రికి తరలించారు, మొదటి ఇన్నింగ్స్‌లో గాయంతో రిటైర్ అయిన కొద్దిసేపటికే, కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న గిల్ రెండవ టెస్ట్ కోసం పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందలేదు.
KL Rahul as a Captain for ODI Team
తదుపరి అంచనా కోసం ముంబైకి వెళ్తాడు. అక్టోబర్‌లో ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్ కోసం వన్డేలలో తనకు డిప్యూటీగా ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ సైతం తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం కోలుకున్నా ఆడే పరిస్థితి లేదు. దీంతో ఆట నుండి తప్పుకున్నాడు. ఇద్దరు కీలకమైన ఆటగాళ్లు గాయాల బారిన పడడంతో జట్టులో సీనియర్ అయిన కేఎల్ రాహుల్ ను స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు అజిత్ అగార్కర్. ఇక రాహుల్ సంగతికి వస్తే తను ఇప్పటి వరకు 88 మ్యాచ్ లు ఆడాడు. 48.32 సగటుతో 3092 రన్స్ చేశాడు. ఇక మ్యాచ్ ల విషయానికి వస్తే తొలి వన్డే నవంబర్ 30న రాంచీలో, డసెంబర్ 3న రాయ్ పూర్ , 6న వైజాగ్ లో జరగనుంది.
Also Read : Janasena Huge Support : 1,400 జనసేన కుటుంబాలకు బీమా సహాయం


















