Kharge : బెంగళూరు కర్ణాటక ముఖ్యమంత్రి వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం పోస్టు కోసం ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ల మధ్య ప్రచ్చన్న యుద్దం కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ గా డీకే సారథ్యంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే చివరి దాకా డీకే శివకుమార్ సీఎం అవుతారని అనుకున్నారు. కానీ ఆయనపై పలు కేసులు నమోదై ఉండడంతో గత్యంతరం లేక అనుభవం కలిగిన, సౌమ్యుడైన సిద్దరామయ్యకు ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య సయోధ్య కుదిర్చారని, ఇందులో భాగంగా మొదటి రెండున్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఉంటారని, ఆ తదుపరి రెండున్నర సంవత్సరాలు డీకే శివకుమార్ కొలువు తీరుతారని ఒప్పందం చేసినట్లు సమాచారం.
Mallikarjun Kharge Focus on Karnataka CM Issue
ఇదిలా ఉండగా సిద్దరామయ్య టర్మ్ ఒప్పందం ప్రకారం పూర్తయింది. దీంతో అత్యధిక స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రెండు వర్గాలుగా చీలి పోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ తరుణంలో సీఎం ఎవరు ఉండాలనే వివాదం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి దేశంలో మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ . ఇక తెలంగాణలో ఇప్పటికే సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఆయన సైతం గోడ దూకేందుకు సిద్దంగా ఉన్నారని, బీజేపీతో టచ్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో గురువారం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
Also Read : ED Shocking Inspection : 15 ప్రదేశాలలో ఈడీ విస్తృత తనిఖీలు
















