అమరావతి : ఏపీ విద్యా శాఖ అరుదైన ఘనతను సాధించింది. మంత్రి నారా లోకేష్ విద్యా శాఖ మంత్రిగా తనదైన ముద్ర కనబరిచారు. ఈ మేరకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తాజాగా ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ కాలేజీలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మెరుగైన ఫలితాలను సాధించారు. జూనియర్ కాలేజీ విద్యార్థులకు పకడ్బందీగా యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ-ఫైనల్ పరీక్షలను కేంద్రీకృత పద్ధతిలో నిర్వహించారు. పరీక్షా ఫలితాలను డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్ల పనితీరును ప్రతి నెలా సమీక్షించారు. కళాశాల పని వేళలను ఉదయం 9:30 నుంచి 9 గంటలకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మార్చారు.
విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారిని A, B, C కేటగిరీలుగా విభజించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో ఇంకా మెరుగు కావాలో గుర్తించి ఆ దిశగా శిక్షణ అందించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను రూపొందించి పంపిణీ చేశారు. కేర్ టేకర్ వ్యవస్థ ద్వారా ప్రతి జూనియర్ లెక్చరర్ కనీసం 10 మంది విద్యార్థులను దత్తత తీసుకుని, వారి హాజరు, ఫలితాల బాధ్యతను స్వీకరించారు. విద్యార్థుల సంక్షేమం చూస్తూనే ఇందులో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంపొందించారు. జూనియర్ కాలేజీల్లో ఏడాదికి రెండుసార్లు మెగా పేరెంట్ టీచర్ మీటింగులు నిర్వహించి.. పిల్లల ప్రగతిని వివరించే ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు.
