UPI : డిజిటల్ పేమెంట్స్‌ను మరింత విస్తృతం చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15, 2025 నుంచి యూపీఐ (UPI) లావాదేవీల పరిమితులను పెంచుతూ నూతన మార్పులను అమల్లోకి తెస్తోంది. దీంతో పెద్ద మొత్తాల చెల్లింపులు కూడా యూపీఐ ద్వారా సులభంగా నిర్వహించే అవకాశం కలుగుతుంది.
ఈ మార్పుల ద్వారా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, క్యాపిటల్ మార్కెట్స్, ప్రభుత్వ లావాదేవీలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, ట్రావెల్ బుకింగ్స్ వంటి పేమెంట్స్ యూపీఐ ద్వారా నేరుగా చేయవచ్చు. ఇప్పటివరకు చిన్న మొత్తాల లావాదేవీలకే పరిమితమైన యూపీఐ, ఇకపై మల్టీ-యూజ్ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌గా మారనుంది.
UPI – కొత్త పరిమితులు ఇలా ఉన్నాయి:
- క్యాపిటల్ మార్కెట్స్ & ఇన్వెస్ట్‌మెంట్స్: ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు, రోజుకి రూ. 10 లక్షలు.
- ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్: ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు, రోజుకి రూ. 10 లక్షలు.
- ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM): ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు, రోజుకి రూ. 10 లక్షలు.
- ట్రావెల్ పేమెంట్స్: ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు, రోజుకి రూ. 10 లక్షలు.
- క్రెడిట్ కార్డ్ బిల్స్: ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు, రోజుకి రూ. 6 లక్షలు.
- బిజినెస్/మర్చంట్ లావాదేవీలు: ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు, రోజువారీ పరిమితి లేదు.
- జ్యువెలరీ కొనుగోళ్లు: ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు, రోజుకి రూ. 6 లక్షలు.
- ఫారిన్ ఎక్స్చేంజ్ రిటైల్ (BBPS ద్వారా): ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు, రోజుకి రూ. 5 లక్షలు.
- డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్ & ఇనిషియల్ ఫండింగ్: ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు, రోజుకి రూ. 2 లక్షలు.
- పీర్-టు-పీర్ (P2P) ట్రాన్సాక్షన్స్: పాత పరిమితులు కొనసాగుతాయి (ఒక్కో లావాదేవీ రూ. 1 లక్ష వరకు మాత్రమే).
ఎందుకు ఈ మార్పులు?
దేశంలో యూపీఐ వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. చిన్న దుకాణాల నుంచి కార్పొరేట్ లావాదేవీల వరకు ప్రజలు యూపీఐనే ప్రధాన పేమెంట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. పెద్ద మొత్తాల లావాదేవీలు ఒకేసారి పూర్తయ్యేలా లిమిట్స్ పెంచడం ద్వారా, వినియోగదారులు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్లు లేదా ఇతర పద్ధతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.
ఎన్‌పీసీఐ ప్రకారం, ఈ నిర్ణయం డిజిటల్ ఇండియా లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళ్తుందని, యూపీఐని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పేమెంట్ సిస్టమ్‌లలో ఒకటిగా నిలబెడుతుందని అంచనా.
Also Read : Nirmala Sitharaman Interesting Update : జీఎస్టీ మార్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు



















