అమెరికా : ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 9 నుండి తమ సంస్థకు చెందిన జెమిని ఏఐ ప్లాన్లలో మార్పులు చేయనుంది. జెమిని ఏఐని ఉపయోగించే విధానాన్ని గూగుల్ మారుస్తోంది. అక్టోబర్ 9 నుండి ఉచిత ప్లాన్ వినియోగదారులకు అత్యంత శక్తివంతమైన మోడల్స్ అందుబాటులో ఉండవు. జెమిని ఏఐకి సంబంధించిన మీ యాక్సెస్ (వాడుక విధానం) త్వరలో మారబోతోంది. వినియోగ విధానాన్ని అప్డేట్ చేయనుంది. దీనివల్ల వివిధ ఏఐ మోడల్స్‌కు లభించే యాక్సెస్ అనేది మీ నిర్దిష్ట ఏఐ ప్లాన్‌పై స్పష్టంగా ఆధారపడి ఉంటుంది. ఆచరణలో జెమిని ఏఐ ఉచిత వెర్షన్ వినియోగదారులు ఏఐ ప్లస్ సబ్స్క్రైబర్లు కూడా మరింత శక్తివంతమైన ప్రో మోడల్స్‌ను ఉపయోగించే అవకాశాన్ని పరిమితం చేయబడటం గమనిస్తారు.
అక్టోబర్ 2026 నుండి వ్యక్తిగత ఖాతాతో జెమిని యాప్‌లను ఉపయోగించేటప్పుడు అందుబాటులో ఉండే మోడల్స్‌లో మార్పులు ఉంటాయి అని గూగుల్ తన సపోర్ట్ పేజీలో వెల్లడించింది. ఏఐ సబ్స్క్రిప్షన్ లేని వినియోగదారులకు ఈ మార్పులు 9 నుండి వర్తించడం ప్రారంభిస్తాయి. మీకు గూగుల్ ఏఐ ప్లస్ ఉంటే, మీ వ్యక్తిగత Google ఖాతాకు ఈ మార్పులు , అవి అమల్లోకి వచ్చే తేదీని వివరిస్తూ ఒక ఈమెయిల్ వస్తుందని గూగుల్ ప్రకటించింది. గూగుల్ జెమిని ఏఐ ప్లాన్లలో మార్పులు: కొత్త విధానం ప్రకారం, ఉచిత ప్లాన్ వినియోగదారులు కేవలం చిన్న ఫ్లాష్ లైట్ మోడల్స్‌కు మాత్రమే పరిమితం చేయబడతారు. భారతదేశంలో నెలకు 399 రూపాయల ధర కలిగిన ఏఐ ప్లస్ ప్లాన్లు ఉన్నవారు మాత్రమే దీనిని వాడేందుకు వీలు పడుతుంది.
















