Maganti Sunitha : హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ సంచలన ప్రకటన చేసింది. శుక్రవారం అధికారికంగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నిక లో బరిలో నిలిపేందుకు అభ్యర్థిని ఖరారు చేసింది. తమ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి రవీంద్రనాథ్ సతీమణి మాగంటి సునీతను (Maganti Sunitha) ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. దీంతో ఈ ఉప ఎన్నికపై ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠకు తెర పడింది. ఈ నియజకవర్గంపై పూర్తి దృష్టి సారించింది. మరో వైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగుర వేయాలని సీఎం అనుముల రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు.
Maganti Sunitha as a
ఈ తరుణంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ అభ్యర్థిగా దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ అధ్యక్షుడు ,మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రకటించారు. జూబ్లీహిల్స్ ప్రజలలో సీనియర్ పార్టీ నాయకుడిగా, ప్రముఖ వ్యక్తిగా పరిగణించ బడుతున్న మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన అంకితభావ సేవకు గుర్తింపుగా, కేసీఆర్ తన కుటుంబానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించు కున్నారని పార్టీ ప్రకటించింది. మాగంటి సునీతకు ఆ బాధ్యతను అప్పగించారని పార్టీ నుండి ఒక నోట్ పేర్కొంది. ఈ నిర్ణయం గోపీనాథ్ పట్ల గౌరవాన్ని, ఆయనను ఎంతో గౌరవించే జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని స్పష్టం చేసింది.
Also Read : Minister Lokesh Important Update : పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాల నిర్మాణం
















