హైదరాబాద్ : మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యాడు యంగ్, ఎనర్జటిక్ దర్శకుడు అనుదీప్ కేవీ. తను గతంలో జాతి రత్నాలు మూవీ తీశాడు. ఇది పూర్తిగా కామెడీ జానర్ లో తీశాడు. తక్కువ బడ్జెట్ తో తీసిన ఆ మూవీ అప్పట్లో సెన్సేషన్ గా మిగిలింది. తాజాగా తన నుంచి మరో చిత్రం రాబోతోంది ప్రేక్షకుల ముందుకు. ఫంకీ చిత్రాన్ని కూడా ఇదే జానర్ లో తీశాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ, కుటుంబం, రొమాన్స్ ప్రధానంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు లవ్లీ బ్యూటీ కయాదు లోహర్ నటించారు. వీరితో పాటు వీటివి గణేష్, సంపత్ రాజ్, నరేష్, రఘు బాబు, ఈశ్వరీ రావు, పమ్మీ సాయి, తదితరులు సహాయ పాత్రలలో నటించారు.
ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి మూవీ సంగీతం బిగ్ సక్సెక్ కావడంతో టాప్ లో కొనసాగుతున్నాడు తెలంగాణకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిలీరియో . అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న ఫంకీకి కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు. దీంతో ఫంకీపై పెద్ద ఎత్తున అంచనాలు మరింత పెరిగేలా చేశాయి. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సురేష్ సారంగం అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ బ్యానర్‌లపై నాగ వంశీ , సాయి సౌజన్య నిర్మించారు. ఓటీటీ పరంగా ఫంకీని భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ తీసుకున్నట్లు టాక్. ఇదలా ఉండగా మంగళవారం మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఫంకీ మూవీ రిలీజ్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 13న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తామన్నారు.

















