Kavitha : నిజామాబాద్ జిల్లా : రాష్ట్రంలో విద్యా రంగం కునారిల్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha ). ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు తను జాగృతి జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రైతులను, విద్యార్థులను పరామర్శిస్తూ వారి గోస వింటున్నారు. తాజాగా బాన్సువాడ కొయ్యగుట్ట తండా రెసిడెన్షియల్ కాలేజీని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అంతకు ముందు నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా ముంపునకు గురైన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 25 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Kavitha Strong Demand
రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున సాగు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మోంతా తుపాను ప్రభావం, అకాల వర్షాల కారణంగా పెద్ద ఎత్తున రైతులు నష్ట పోయారని పేర్కొన్నారు. పంటలు నష్ట పోయినా ఇప్పటి వరకు సర్కార్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత. కేజీబీవీలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్య, వైద్యం పక్కదారి పట్టే ప్రమాదం లేక పోలేదని హెచ్చరించారు.
Also Read : Kharge Shocking Comments : వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం : ఖర్గే
















