Kavitha : నిజామాబాద్ జిల్లా : బీసీల జనాభాకు దక్కాల్సిన న్యాయ పరమైన డిమాండ్ ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం సర్కార్ కు ఉందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha). బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి పట్టణంలో కవిత జాగృతి శ్రేణులతో కలిసి రైల్ రోకో నిర్వహించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kavitha Demands
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం దారుణం అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
రిజర్వేషన్లు అమలు చేసేంత దాకా తమ పోరాటం ఆగదని ప్రకటించారు కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలో చాలా సమస్యలు పేరుకు పోయాయని, ప్రధానంగా చేపట్టాల్సిన ఎత్తిపోతల పథకాలు ఇంకా పూర్తి కావడం లేదన్నారు. పంటలు నష్ట పోయిన రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ఇదే సమయంలో అన్నదాతలను ఆదుకోవాలని కోరారు కల్వకుంట్ల కవిత.
Also Read : MP Gurumurthy Strong Focus : అన్నదాన సత్రం నిర్మాణానికి కేంద్రం ఓకే

















