Kannappa : ఎట్టకేలకు మంచు విష్ణు చేసిన ప్రయత్నం ఫలించింది. ఊహించని రీతిలో జనాదరణ పొందింది తను నటించిన చిత్రం కన్నప్ప. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది జూన్ 27న శుక్రవారం. ఎవరూ ఊహించని రీతిలో పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. మంచు మోహన్ బాబు సమర్పించారు. దీనిని భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఏకంగ ఈ కన్నప్ప కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని దిగ్గజ నటుడు బ్రహ్మానందం ప్రకటించారు. ఆ సాక్షాత్తు పరమ శివుడే మోహన్ బాబులో ఆవహించడం వల్లనే ఈ కన్నప్ప చిత్రంగా ముందుకు వచ్చిందని చెప్పారు.
Kannappa Movie Collections
కన్నప్ప (Kannappa) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ సక్సెస్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయడంలో ఫోకస్ పెట్టాడు నటుడు మంచు విష్ణు. ఈ సినిమాలో భారతీయ సినీ రంగానికి చెందిన నటీనటులు కీ రోల్స్ పోషించారు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మోహన్ లాల్ , కాజల్ అగర్వాల్ , డార్లింగ్ ప్రభాస్ , రఘు బాబు , తదితరులు నటించారు.
మంచు విష్ణు నటన బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. విష్ణు సినిమా కూడా ఓపెనింగ్ లో మంచి వసూళ్లను రాబట్టింది. కన్నప్ప సినిమా నిస్సందేహంగా మంచు విష్ణుకి అత్యధిక ఓపెనింగ్ రావడం విశేషం. మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి బహుళ భాషల స్టార్లు కూడా తమ స్టార్ పవర్‌తో కన్నప్ప సినిమా కలెక్షన్లకు తోడ్పడ్డారు. దీని కారణంగా కన్నప్ప తొలి రోజున రూ.13 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
Also Read : Hero Vijay Antony – Maargan : నూతన ప్రయోగం మార్గాన్ సంచలనం
