వైకుంఠ ఏకాద‌శి కోసం కాణిపాకం సిద్దం

భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామ‌న్న క‌లెక్ట‌ర్

hellotelugu-kanipakamTemple

చిత్తూరు జిల్లా : ప్రతి సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది జనవ‌రి 1ని పురస్కరించుకుని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్లు పూర్తి చేశామ‌న్నారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ . వైకుంఠ ఏకాదశి, ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్ల పై కాణిపాకం ఆలయ ఆవరణలోని ప్రత్యేక సమావేశం మందిరంలో జిల్లా ఎస్ పి తుషార్ డూడి, పూతలపట్టు ఎం ఎల్ ఏ కలికిరి మురళి మోహన్, ఆలయ ఈ ఓ పెంచాల కిశోర్, ఆలయ ఛైర్మన్ మణి నాయుడు లతో కలసి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు రావడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ అధికారులను ఆదేశించామన్నారు. డిసెంబర్ 30, 31 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆంగ్ల సంవత్సరాది జనవరి 01వ తేదీలలో సుమారు 60 వేల మంది పైగా భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు. సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం కలిగించడంలో భాగంగా ఆలయ కార్య నిర్వహణ అధికారితో సమన్వయం చేసుకుని సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయ‌డంపై ఫోక‌స్ పెట్టార‌న్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తోపులాటలు జరగకుండా ఉండేలా ఆలయం లోపల, బయట పకడ్భందీగా క్యూ లైన్ లు ఏర్పాటు చేయాల‌న్నారు.

Exit mobile version