Kandula Durgesh : అమరావతి : రైతుల సంక్షేమం కోసం తమ కూటమి సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి ప్రయారిటీ ఇచ్చిన ఘనత తమ రాష్ట్రానికే దక్కిందన్నారు. ఇదిలా ఉండగా నిడదవోలు పట్టణంలోని శ్రీ రంగా సుబ్బారావు సత్యవతి కాపు కళ్యాణ మండపంలో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.11 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు తీసుకొచ్చిన తొలి ఎమ్మెల్యేగా, మంత్రిగా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ప్రకటించారు కందుల దుర్గేష్.
Minister Kandula Durgesh Comments
రైతుల సంక్షేమం, మార్కెట్ యార్డుల అభివృద్ధి, రైతుబజార్ ఏర్పాటు వంటి అంశాలపై నూతన కమిటీ దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటికే మార్కెట్ యార్డు కోసం మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆది నారాయణ స్థలాన్ని కేటాయించడం పట్ల ప్రశంసలు కురిపించారు. త్వరలోనే అన్ని అవసరమైన సదుపాయాలతో మార్కెట్ యార్డు, రైతు బజార్ నిర్మాణం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. ఎక్స్-అఫీషియో ఛైర్మన్‌గా ప్రభుత్వానికి, మార్కెట్ కమిటీకి మధ్య వారధిగా నిలిచి రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో లక్ష్యానికి మించి ధాన్యం సేకరించి రైతుల ఖాతాల్లో కేవలం 48 గంటల్లోనే నగదు జమ చేయడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు మంత్రి.
Also Read : AP Govt Important Update for Cyclone : తుపాను ప్రభావం 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం
















