Kandula Durgesh : విజయవాడ : వందేమాతరం జాతీయ గీతం మాత్రమే కాదని అది 143 కోట్ల భారతీయులకు చెందిన ఆత్మ గీతమని స్పష్టం చేశారు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వందేమాతరం 150 వసంతాల ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ అరుదైన కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కావడంతో ఈ కార్యక్రమానికి కొత్త కళ వచ్చిందని చెప్పారు.
MInister Kandula Durgesh Key Comments
స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసిన, భారత జాతిని జాగృతం చేసిన శక్తి గీతం వందేమాతరం అన్నారు కందుల దుర్గేష్. ఈ గీతాన్ని రచించిన మహాకవి బంకించంద్ర చటర్జీకి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయ పూర్వక నివాళులు అర్పిస్తున్నానని అన్నారు మంత్రి. వందేమాతరం గీతం మనకు కేవలం స్వాతంత్ర స్మృతి మాత్రమే కాదని, భవిష్యత్ భారతదేశానికి దారిచూపే సమగ్రాభివృద్ధి మంత్రం కూడా అని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. ఈ గీతం నినాదం వినగానే మనలో ఉప్పొంగే దేశభక్తి, స్వాభిమానం అపారమైనవని అన్నారు. భారత దేశ చరిత్రలో బాల గంగాధర్ తిలక్ నుండి నేతాజీ, గోఖలే నుండి మహాత్మాగాంధీ వరకు అందరికీ ఈ గీతం స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు.
ఈ గీతం 150 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా 2025 నవంబర్ 10 నుండి 2026 నవంబర్ 10 వరకు దేశ వ్యాప్తంగా ప్రతి పాఠశాల, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వందేమాతరం సామూహిక గానం చేయాలనే పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని చెప్పారు కందుల దుర్గేష్.
Also Read : Bomb Blast – Red Fort : ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు

















