Kandula Durgesh : అమరావతి : వచ్చే 2027 సంవత్సరంలో ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో చేపట్టబోయే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేశారు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభాగాల వారీగా సాగుతున్న ప్రాథమిక పనులు, అవసరమైన సౌకర్యాలు, రద్దీ నియంత్రణ, భద్రతా చర్యలు, తాగునీరు–వసతి ఏర్పాట్లు, శానిటేషన్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు మంత్రి కందుల దుర్గేష్. పుష్కరాలను పురస్కరించుకు ముందస్తుగానే సర్కార్ నిధులు మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు.
Minister Kandula Durgesh Key Update
పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులు రానున్నారని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. నేపథ్యంలో తక్షణమే చేపట్టాల్సిన పనులు, దీర్ఘకాల ప్రణాళికలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా సమగ్ర వ్యూహం పై కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు , పేరాబత్తుల రాజశేఖరం, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి , రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ , తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ , కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, రుడా ఛైర్మెన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Also Read : Imran Khan Son Strong Demand : ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడని నిరూపించాలి















