Kanaka Durgamma : విజయవాడ : దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీవరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. పలువురు మంత్రులు సందర్శించారు. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ, సీపీ రాజశేఖర్ బాబు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 20 లక్షల మందికి పైగా కనకదుర్గమ్మ అమ్మ (Kanaka Durgamma) వారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను క్యూలో నిలుచున్న భక్తులకు పాలు, మజ్జిగ, పులిహోర, లడ్డూలు కూడా ఇస్తున్నారు. ఇదిలా ఉండగా భక్తుల కోసం ప్రత్యేకించి ఇప్పటి వరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 36 లక్షల లడ్డూలు సిద్దం చేసినట్లు చెప్పారు. ఈ సందర్బంగా ప్రసాద తయారీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
Kanaka Durgamma Ustavams Update
ఇక్కడ దొరికే ఐకానిక్ లడ్డూ ప్రసాదానికి మంచి ఆదరణ ఉంది. పెద్ద ఎత్తున భక్తులు కావాలని కోరుతున్నారు. దీంతో వారి డిమాండ్ కు అనుగుణంగా పెద్ద ఎత్తున లడ్డూలను తయారు చేయించడం జరిగిందని చెప్పారు జిల్లా కలెక్టర్. శనగపిండి, చక్కెర, నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు , ఏలకులతో తయారు చేసిన ప్రసాదానికి అత్యున్నత నాణ్యతను నిర్ధారిస్తుందని ఆయన అన్నారు. మూల నక్షత్రం, విజయ దశమి వంటి ప్రత్యేక రోజులలో లడ్డూలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోందని చెప్పారు డాక్టర్ జి. లక్ష్మీశ. రియల్ టైమ్‌లో ప్రసాదం కౌంటర్లను పెంచుతున్నట్లు తెలిపారు. కనక దుర్గా నగర్ బేస్ సెంటర్‌తో పాటు, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో ప్రసాదం అమ్మకపు దుకాణాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
Also Read : Ex CI J Shankar Notice to CM Sensational : చంద్రబాబుకు మాజీ సీఐ లీగల్ నోటీస్
