చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కు ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ సుదీర్ఘ లేఖ రాశారు. ఈ సందర్బంగా గ్రామ సభలను బలోపేతం చేయాలని కోరారు . భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ఎ కింద గుర్తింపు పొందిన గ్రామ సభ భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రత్యక్ష వ్యక్తీకరణ అని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఇక్కడ పౌరులు తమ ఆందోళనలను వ్యక్తం చేయవచ్చు, సామాజిక సమస్యలపై చర్చించవచ్చు . స్థానిక పాలనలో పాల్గొనవచ్చు అని అన్నారు మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్. అక్టోబర్ 2న జరగనున్న సమావేశాలకు ముందు, గ్రామ సభలను బలోపేతం చేయడానికి వాటిని క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యానికి మరింత సమర్థవంతమైన సంస్థలుగా మార్చడానికి చర్యలను సూచించారు.
తన లేఖలోని వివరాలను పంచుకుంటూ కమల్ హాసన్ మాట్లాడారు. గ్రామ పంచాయతీ ప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచడం, స్థానిక టాస్మాక్ అవుట్‌లెట్‌లకు సంబంధించిన నిర్ణయాలలో గ్రామ సభలకు నిర్ణయాత్మక పాత్ర ఇవ్వడం, ప్రజా భాగస్వామ్యాన్ని మెరుగు పరచడం, సమావేశాలలో ఆమోదించిన తీర్మానాలపై కాల పరిమితితో కూడిన చర్యను నిర్ధారించడం వంటి చర్యలను తాను సిఫార్సు చేసినట్లు తెలిపారు. గ్రామ సభ సమావేశాలను క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యానికి మరింత అర్థవంతమైన సంస్థలుగా బలోపేతం చేయడానికి తాను తమిళనాడు ముఖ్యమంత్రి తిరు సి. జోసెఫ్ విజయ్‌కు ఈ క్రింది సిఫార్సులతో లేఖ రాశానని చెప్పారు.
గ్రామ పంచాయతీ ప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచాలని, స్థానిక టాస్మాక్ అవుట్‌లెట్‌లపై గ్రామ సభలకు నిర్ణయాత్మక వాణిని ఇవ్వాలని. అవగాహన , ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలని , గ్రామ సభ తీర్మానాలపై కాలపరిమితితో కూడిన చర్యను నిర్ధారించాలని కోరారు కమల్ హాసన్. గ్రామ సభ అజెండాలో పౌరులకు మరింత ప్రాధాన్యత కల్పించాలని , స్థానిక పరిపాలనలో పరిశోధన, సామర్థ్య నిర్మాణాన్ని బలోపేతం చేయాలన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికను నిజంగా భాగస్వామ్యంతో కల్పించలని పేర్కొన్నారు. గాంధీజీ గ్రామ స్వరాజ్ దార్శనికత సాధికారత కలిగిన గ్రామాలు, భాగస్వామ్య ప్రజాస్వామ్యంలో పాతుకు పోయింది. ఆయన వారసత్వాన్ని గౌరవించాలంటే, తమిళనాడు గ్రామ పరిపాలనలో భారతదేశానికి ఆదర్శ రాష్ట్రంగా మారడమే ఉత్తమ మార్గం అని కమల్ హాసన్ జోడించారు.
