హైదరాబాద్ : అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఎట్టకేలకు మోస్ట్ ఎంటర్ టైనర్ షోగా జనాదరణ పొందిన బిగ్ బాస్ -9 రియాల్టీ షో విజేతగా నిలిచాడు కళ్యాణ్ పడాల. గత కొంత కాలంగా ఈ షో జియో స్టార్ మా లో ప్రసారం అవుతూ వచ్చింది. ఎన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు చేసుకుంటూ వచ్చింది బిగ్ బాస్ . అందరూ తనూజ పుట్టస్వామికే కప్ వరిస్తుందని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఫైనల్ ఓటింగ్ లో తనూజ పుట్టస్వామి వెనుకబడి పోవడం ఆశ్చర్య పోయేలా చేసింది. మొత్తం పాల్గొన్న కంటెస్టెంట్స్ లలో చివరి రౌండ్ వరకు వచ్చే సరికి ఐదుగురు మిగిలారు. వారిలో ఫైనల్ ఓటింగ్ వచ్చే సరికి ముగ్గురు నిలిచారు. ఇందులో తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యూయెల్, కళ్యాణ్ పడాల. ఓటింగ్ లో తొలుత తనూజ టాప్ లో నిలిచింది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగింది. ఆ తర్వాత రాకెట్ లా దూసుకు వచ్చాడు కళ్యాణ్ పడాల. దీంతో తనూజ పుట్టస్వామి రెండవ స్థానంతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. మూడో ప్లేస్ లో ఇమ్మాన్యూయెల్ నిలిచాడు.హైదరాబాద్ లో జరిగిన బిగ్ బాస్ -9 గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో హోస్ట్ అక్కినేని నాగార్జున అంతిమ విజేత ఎవరో ప్రకటించాడు. విన్నర్ గా నిలిచిన కళ్యాణ్ పడాలకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. దీంతో ఇన్నాళ్లుగా అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ -9 రియాల్టీ ఆదివారం నాటితో ముగిసింది. ఇదిలా ఉండగా
కళ్యాణ్ పడాల బిగ్ బాస్ చరిత్రలో అతి పిన్న వయస్సు కలిగిన వ్యక్తి. విజేతగా ట్రోఫీ తీసుకున్న అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు కళ్యాణ్ పడాల. తను ట్రోఫీతో పాటు మారుతి సుజుకి విక్టోరియస్ ఎస్యూవీతో పాటు ఓ స్పాన్సర్ నుండి రూ. 5 లక్షలు పొందాడు.



















