హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత టాప్ లో కొనసాగుతున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయనతో గతంలో వాల్తేరు వీరయ్య పేరుతో మూవీ తీశాడు దర్శకుడు బాబి. తాజాగా చిరంజీవకి సంబంధించిన కెరీర్ లో 158వ చిత్రం చేస్తున్నాడు. మెగా అభిమానులకు తీపి కబురు చెప్పాడు బాబి. ఈ మేరకు ఈ చిత్రానికి కాకా అని పేరు పెట్టినట్లు ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. ఇదిలా ఉండగా ఇంతకు ముందు ‘మెగా 158’గా పిలువబడిన ఈ చిత్రానికి ‘కాక’ అనే పేరును ఖరారు చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ టైటిల్ , ‘గ్లింప్స్’ విడుదలయ్యాయి.
విజయవంతమైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కలయికలో వస్తున్న రెండో చిత్రం ఇది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనస్వార రాజన్ , నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయిన ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కాక’ చిత్రం 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. యాక్షన్, ఎమోషన్ , కమర్షియల్ అంశాల కలయికగా రాబోతున్న ఈ సినిమాపై, విడుదల తేదీ ప్రకటన మరింత ఉత్సాహాన్ని పెంచింది.
చిరంజీవి, బాబీ కొల్లి మరోసారి జతకట్టడంతో ‘కాక’ చిత్రంపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్, చిరంజీవి పాత్ర , సినిమాలోని యాక్షన్ ప్రపంచంపై మరింత కుతూహలాన్ని రేకెత్తించింది.
