Kajol Devgan : 1990వ దశకంలో అత్యంత జనాదరణ పొందిన నటిగా గుర్తింపు పొందారు కాజోల్ దేవగన్. ఆ మధ్యన బోల్డ్ వెబ్ సీరీస్ లో నటించింది. అది సంచలనంగా మారింది. వృత్తి పరంగా నటిగా అన్ని పాత్రలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ. వయసు మీద పడినా ఎక్కడా తన అందం చెక్కు చెదరలేదు. సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వక పోయినా వెబ్ సీరీస్ పై దృష్టి పెట్టింది. తనకు అపారమైన ఛాన్స్ లు వస్తున్నాయి. ఈ సందర్భంగా తను కీ రోల్ పోషించిన వెబ్ సీరీస్ ది ట్రయల్ – ప్యార్ ఖానూన్ ధోఖా నిర్మాతలు 2వ సీజన్ ను విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. దీనిపై స్పందించింది నటి కాజోల్ దేవగన్ (Kajol Devgan). ఈ ఏడాది తనకు అద్భుతమైన శుభారంభం ఇవ్వ బోతోందని ఆశా భావం వ్యక్తం చేశారు.
Kajol Devgan Web Series
ఇందుకు సంబంధించి వీడియోను కూడా రిలీజ్ చేశారు. నటి పాత్ర నోయోనికా సేన్‌గుప్తా ఇప్పుడు క్రూరమైన చట్ట ప్రపంచంలో తన అడుగు జాడలను కనుగొన్నట్లు చూపిస్తుంది, ఆమె కొత్త సవాళ్లు, అసాధ్యమైన ఎంపికలు, దిగ్భ్రాంతికరమైన ద్రోహాలతో పోరాడుతుంది, అవి మిమ్మల్ని సీట్ల అంచున ఉంచుతాయి. వృత్తిపరంగా చూస్తే ఇది నాకు చాలా సుసంపన్నమైన సంవత్సరం అని పేర్కొంది కాజోల్ దేవగన్. కెరీర్ లో అనేక రకాల పాత్రలు తనకు లభించాయని, ఇదే సమయంలో కథలను అన్వేషించే ఛాన్స్ కూడా దక్కిందన్నారు. ఈ సీజన్ మరింత ఆనందాన్ని కలిగిస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు నటి. ఈ వెబ్ సీరీస్ యుఎస్ లో ది గుడ్ వైఫ్ కు మాతృక. ది ట్రయల్ సీజన్ 2వ తేదీ సెప్టెంబర్ లో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Hero Rajinikanth Coolie : విడుదల కాకుండానే కూలీ సంచలనం


















