Kadiyam Srihari : వరంగల్ జిల్లా : ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ బతికి ఉన్నంత వరకే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అన్నారు. ఆయన చని పోయాక ఆ పార్టీ మూడు ముక్కలు కావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. తనకు నాయకత్వ లక్షణాలు లేవని, ఆయనను ఎవరూ నాయకుడిగా గుర్తించడం లేదన్నారు. కేసీఆర్ ఉన్నంత వరకే తన్నీరు హరీష్‌రావు తన వద్ద ఉంటారని, ఆ తర్వాత తను బయటకు వస్తాడని, ఆ పార్టీకి గుర్తింపు లేకుండా పోతుందన్నారు కడియం శ్రీహరి.
Kadiyam Srihari Shocking Comments on KCR’s BRS Party
గురువారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ తనంతకు తానుగా సీఎంగా ఫీలవుతున్నాడని ఎద్దేవా చేశారు. అహంకార పూరితంగా వ్యవహరించడం వల్లనే కేసీఆర్ స్వంత కూతురు కల్వకుంట్ల కవిత ఆ పార్టీని వీడారని అన్నారు. అహంకారం, బలుపు మాటలతో నాయకులు ఎప్పటికీ కాలేరన్నారు. ఇప్పటికే కేటీఆర్ పై 10 కేసులు ఉన్నాయని చెప్పారు కడియం శ్రీహరి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనా కాలంలో 36 మందిని ఆ పార్టీలో చేర్చుకున్నారని, మరి అప్పుడు కేటీఆర్ కు ఈ రాజకీయ విలువలు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తాజాగా కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించలేదు.
Also Read : Sheikh Hasina Shocking : మూడు కేసుల్లో షేక్ హసీనాకు 21 ఏళ్ల జైలు శిక్ష

















