K Kavitha : ఆదిలాబాద్ జిల్లా : తుపాను కారణంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో రైతులు నష్ట పోయారని, సర్కార్ మాత్రం చోద్యం చూస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (K Kavitha). ఆమె జనం బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు కార్తీక పౌర్ణమి సందర్బంగా ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంకా పరిష్కరం కానీ సమస్యలు చాలా ఉన్నాయన్నారు. వాటి గురించి ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకుంటాం అన్నారు. తాను 20 ఏళ్లుగా ప్రజా జీవితం లో ఉన్నానని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించిందన్నారు.
K Kavitha Slams Congress Govt
పత్తి సీజన్ ఉందని, అదే విధంగా మొంథా తుపాను ఎఫెక్ట్ ఉందని ప్రజా ప్రతినిధులకు ముందే తెలుసు అయినా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నించారు.ఎంపీ, ఎమ్మెల్యే సహా ఏ నాయకులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ అయినా సమస్యను ప్రభుత్వం ముందు ఉంచి, ఒత్తిడి పెంచాల్సింది కానీ అలా చేయలేదన్నారు. పత్తి తేమ శాతం పెంచి తీసుకోవాలని తాను కలెక్టర్ కు తెలిపానని చెప్పారు కవిత. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మీద ఉన్న శ్రద్ద ప్రభుత్వానికి పత్తి రైతుల మీద లేదంటూ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో రైతులు లేరు కనుక వారిని పట్టించు కోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అంటూ మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం లో రైతు సంతోషంగా లేడన్నారు.
Also Read : Balka Suman Shocking Comments on CM : బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం

















