K Kavitha : హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (K Kavitha) శనివారం జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వందలాది అనుచరులతో హైదరాబాద్ గన్ పార్క్ అమర వీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారని అన్నారు. వారి త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. ఏ ఆశయాల కోసం వారు అమరులయ్యారో వాటిని ఎంత వరకు సాధించుకున్నామో ఆలోచించు కోవాలని అన్నారు కవిత. ఆనడు పేగులు తెగేదాక కొట్లాడిన ఉద్యమ కారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఒక్కసారి చూడాలన్నారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీ లో చెప్పాం. కానీ వారికి ఇవ్వాల్సిన గౌరవం, గుర్తింపు ఇవ్వలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
K Kavitha Janam Baata Started
ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పామని, కానీ కేవలం 580 మందికి మాత్రమే న్యాయం జరిగిందని, మిగతా వారికి అన్యాయం, కన్నీళ్లే మిగిలాయని పేర్కొన్నారు కవిత. ఉద్యమకారుల్లో కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎంపీటిసీ, సర్పంచులు లాంటి అవకాశాలు వచ్చాయన్నారు.
కానీ ఇంకా వేలాది మందికి జరగాల్సిన న్యాయం జరగ లేదన్నారు. ఇప్పటికి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుతో పోరాడుతూనే ఉన్నారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా లేకపోయిన సరే ఎంపీగా, ఎమ్మెల్సీగా కొనసాగినట్లు చెప్పారు. ఇవాల్టి నుంచి నాలుగు నెలల పాటు జనం బాట కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
Also Read : Minister Savitha Interesting Update : పెనుకొండలో 68 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు
















