K Kavitha : హైదరాబాద్ : మొంథా తుపాను ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున చేతికి వచ్చిన పంటలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (K Kavitha). శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో నీటి పాలయ్యాయని వాపోయారు. పూర్తిగా దెబ్బతిన్నాయని ఈ సమయంలో అన్నదాతలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు కవిత. ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాల దెబ్బకు పంటలు నీటి పాలయ్యాయని పేర్కొన్నారు. రైతులకు ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తారవ్వ అనే మహిళా రైతు ఆవేదన చూస్తే అర్థమవుతున్నదని పేర్కొన్నారు.
K Kavitha Strong Demand
రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయని తెలిపారు కవిత. ఇలాంటి కష్ట కాలంలో రైతులకు ప్రభుత్వం భరోసానివ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.. ఎకరానికి రూ.10 వేల సాయం ఏమాత్రం సరిపోదని, ఒక్కో ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత. యాసంగి పంటల సాగు కోసం ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వడంతో పాటు రైతు భరోసా సాయాన్ని త్వరగా విడుదల చేయాలని కోరారు. ఇందు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున కీలక ప్రకటన చేయాలని సూచించారు. రైతు బీమా చెల్లించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు.
Also Read : Minister Azharuddin Growth : మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్
















