K Kavitha : కరీంనగర్ జిల్లా : తుపాను ప్రభావం కారణంగా పంటలను కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (K Kavitha). జాగృతి జనంబాట కరీంనగర్ జిల్లాలో చేపట్టారు. ఈ సందర్బంగా పంటలు కోల్పోయిన రైతుల వద్దకు వెళ్లారు. దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు. అన్నదాతలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు కవిత. శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టును పరిశీలించారు. ఇటీవల సూసైడ్ చేసుకున్న శ్రీహర్షిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె తల్లిని ఓదార్చారు. ఒక తల్లిగా బిడ్డను కోల్పోయిన ఆమె ఆవేదనను అర్థం చేసుకున్నానని అన్నారు.
K Kavitha Slams Congress Govt
శ్రీహర్షిత ఉన్నతాధికారి కావాలని అనుకున్నదని, కానీ అంతలోనే తను ఆత్మహత్యకు పాల్పడడం తనను కలిచి వేసిందన్నారు కల్వకుంట్ల కవిత. దివంగత ప్రధాని పివి నరసింహారావు గ్రామం వంగర నుండి వచ్చిన శ్రీ వర్షిత బిసి రెసిడెన్షియల్ హాస్టల్‌లో చదువుతుండగా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తనను మరింత బాధకు గురి చేసిందన్నారు కవిత. ఇది ఆత్మహత్య అని ప్రభుత్వం , పాఠశాల అధికారులు చెబుతున్నారని, కానీ ఆమె తల్లిదండ్రులు తను చనిపోయే గంట ముందు తమతో మాట్లాడిందని చెప్పారని తెలిపారు. గంటన్నర వ్యవధిలో ఏం జరిగిందో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : KTR Shocking Comments on Jubilee Hills : జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీదే గెలుపు


















