K Kavitha : వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు నిప్పులు చెరిగారు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై. ఇప్పటి వరకు ఎందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ప్రశ్నించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడారు. అంతకు ముందు వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (K Kavitha) చాయ్ పే చర్చ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి చాయ్ తాగి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు, ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇతర అంశాల గురించి చర్చించారు.
K Kavitha Demand
ఈ సందర్భంగా విద్యార్థులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామంటే నమ్మి ఓటు వేశామని, కానీ పవర్ లోకి వచ్చాక తమ గోడు పట్టించు కోవడం లేదంటూ వాపోయారు. తమను నమ్మించి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ల ప్రక్రియ పూర్తి చేసి అవన్నీ తాము ఇచ్చిన ఉద్యోగాలుగా చెప్పుకుంటుందోని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలతో పాటు జోనల్ వ్యవస్థ అంశాలపై పోరాడాలని కవితకు విన్నవించారు. రాష్ట్రంలో మళ్లీ అధికార మార్పిడి జరిగితేనే నిరుద్యోగుల జీవితాల్లో మార్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read : DY CM Pawan Kalyan Important Visit : అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్


















