అమరావతి : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహ్మాత్మా జ్యోతిరావు పూలే అని, మహిళా విద్య, దళిత, బడుగు వర్గాల హక్కుల కోసం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన యోధుడు అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. జ్యోతిరావు పూలే ద్విశతబ్ది జయంతి సందర్బంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి మంత్రి సవిత ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 1827 ఏప్రిల్ 11 పూణేలో జన్మించిన సాధారణ కుటుంబంలో జన్మించారన్నారు. చిన్ననాటి నుంచే పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించిన వ్యక్తి అని అన్నారు.
ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపారన్నారు ఎస్. సవిత. దేశంలో బాలికల కోసం మొట్ట మొదటిసారిగా పాఠశాల స్థాపించారన్నారు. వితంతు పునర్వివాహాలు జరిపించి సమాజంలో చైతన్యం తీసుకొచ్చారన్నారు. మహిళా విద్య, దళిత, బడుగు వర్గాల హక్కుల కోసం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు మంత్రి ఎస్. సవిత. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం జీవితాన్ని ధారపోశారన్నారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారన్నారు.
