ఛాంపియ‌న్ సినిమాపై తార‌క్ ప్ర‌శంస‌

అద్బుతంగా ఉందంటూ ఎన్టీఆర్ కితాబు

hellotelugu-JrNTR

హైద‌రాబాద్ : ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఛాంపియ‌న్ . ప్ర‌ముఖ నటీన‌టులు శ్రీ‌కాంత్, హేమ‌ల ముద్దుల త‌న‌యుడు రోష‌న్ , మ‌ల‌యాళ బ్యూటీ అన‌స్వ‌ర రాజ‌న్ క‌లిసి న‌టించిన చిత్రం ఛాంపియ‌న్. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన మూవీ ట్రైల‌ర్, సాంగ్స్ కు పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ లభిస్తోంది. అంతే కాకుండా ఈ ఛాంపియన్ సినిమాను ఈనెల 25వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌లే హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ అద్భుతంగా జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు పాజిటివ్ టాక్ వ‌స్తోంది. మ‌రో వైపు కీల‌క అప్ డేట్ వ‌చ్చింది సినిమా గురించి. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఏకంగా భారీ ధ‌ర‌కు ఇప్పుడే కొనుగోలు చేయ‌డం విస్తు పోయేలా చేసింది సినీ ఇండ‌స్ట్రీని.

ఇప్ప‌టికే ఛాంపియ‌న్ చిత్రం గురించి న‌టీ న‌టులు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు సైతం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. బాగుందంటూ పేర్కొంటున్నారు. అంతే కాకుండా భార‌త దేశ సినీ రంగంలో టాప్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందిన ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి ప్ర‌శంసలు కురిపించారు. తాజాగా ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు తార‌క్ అలియాస్ జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం ఛాంపియ‌న్ చిత్రం గురించి ప్ర‌స్తావించారు. అంతే కాదు ఛాంపియ‌న్ ను నిర్మించిన చిత్ర నిర్మాత‌ల‌ను. రోష‌న్ , అన‌స్వ‌ర రాజ‌న్ ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. నిర్మాతలు స్వ‌ప్న ద‌త్, ప్రియాంక ద‌త్ ల‌కు చాలా స‌న్నిహితుడు జూనియ‌ర్ ఎన్టీఆర్.

Exit mobile version