RCB : బెంగళూరు – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విక్టరీ పరేడ్ ఘటన. బెంగళూరు వేదికగా జరిగిన ఈ షో చివరకు విషాదాన్ని నింపింది. మొత్తంగా ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 30 వేల మంది వస్తారని అనుకుంటే 3 లక్షల మందికి పైగా వచ్చారంటూ పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. సీఎం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. గత్యంతరం లేక ఈ మొత్తం ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జ్యూడీషియల్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.
RCB Stampede Case Updates
ఎం చిన్న స్వామి స్టేడియంలో తీవ్రంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి శనివారం కమిషన్ రిపోర్టును సమర్పించింది సీఎం సిద్దరామయ్యకు. స్టేడియంలో జరిగిన ఆర్‌సిబి విజయోత్సవాల సందర్భంగా ప్రణాళిక, సమన్వయం, జనసమూహ నిర్వహణలో జరిగిన లోపాలను పరిశోధించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ నెల రోజుల దర్యాప్తు తర్వాత నివేదికను సమర్పించింది.
జస్టిస్ డి’కున్హాతో క్లుప్తంగా చర్చించిన తర్వాత సిద్ధరామయ్య మాట్లాడారు. నేను ఇప్పుడు మొత్తం నివేదికను పరిశీలించలేను. దీనిని జూలై 17న మంత్రివర్గం ముందు ఉంచుతామని ప్రకటించారు. చర్చ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం. స్టేడియం తొక్కిసలాటపై మెజిస్టీరియల్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు.
Also Read : YS Sharmila Shocking Comments : బనకచర్ల ప్రాజెక్ట్ చంద్రబాబుకి ఏటీఎం : షర్మిల
