Jr NTR : హైదరాబాద్ – ప్రముఖ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆ పేరు వింటే చాలన్నారు. ఎనలేని నటనా చాతుర్యం, ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడంటూ కొనియాడారు. తన సినీ జర్నీలో కోట శ్రీనివాస రావుతో నటించిన , పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటయాన్నారు ఎన్టీఆర్ (Jr NTR). ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Jr NTR Comments
ఇదిలా ఉండగా కోట శ్రీనివాస రావు సినీ ప్రస్థానం చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదుతో ప్రారంభమైంది. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. విలన్ గా, కమెడియన్, తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా ఇలా అద్భుతమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం తర్వాత ఆ లోటును భర్తీ చేశారు.
నటనా పరంగా తెలుగునాట చెరిగిపోని ముద్ర వేశారు కోట శ్రీనివాసరావు. ఆయన నటన చిరస్మరణీయం..అజరామరం. సినీ కళామతల్లి ఉన్నంత వరకు తను వెలుగుతూనే ఉంటారు. ఓవైపు నటుడిగా ఇంకో వైపు రాజకీయ నాయకుడిగా ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో ముఖ్య భూమిక పోషించారు. తనకు ఎదురే లేదని చాటారు కోట శ్రీనివాసరావు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.
Also Read : Pawan Kalyan – Kota Death : ‘కోట’ మృతి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి



















