22 వేల ప‌రుగులు చేసిన జో రూట్

అరుదైన రికార్డు సాధించిన క్రికెట‌ర్

hellotelugu-JoeRoot

ఇంగ్లండ్ : ఇంగ్లండ్ కు చెందిన స్టార్ క్రికెట‌ర్ జో రూట్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. త‌న క్రికెట్ కెరీర్ లో 22,000 ప‌రుగులు సాధించిన 9వ అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన బౌల‌ర్లతో త‌ను బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌ను కొట్ట‌డంలో సిద్ద‌హ‌స్తుడు. త‌ను క్రీజులోకి వ‌చ్చాడంటే ఇక ప‌రుగులు పారాల్సిందే. బౌల‌ర్ల వెన్నులో వ‌ణుకు పుట్టించే ద‌మ్మున్న ఆట‌గాడిగా పేరు సంపాదించుకున్నాడు జో రూట్. మెల్ బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన 4వ టెస్టు మ్యాచ్ లో జో రూట్ ఈ ఘ‌న‌త సాధించాడు. కేవ‌లం రెండు రోజుల‌లోనే ఇంగ్లండ్ ఆతిథ్య ఆసిస్ జ‌ట్టును ఓడించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 15 ప‌రుగులు పూర్తి చేసి 22 వేల ప‌రుగుల‌ను దాటేశాడు.

ఇక జో రూట్ ఇప్పుడు 380 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 49.21 సగటుతో 22,000 పరుగులు చేశాడు. క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, కుమార్ సంగక్కర, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, మహేల జయవర్ధనే, జాక్వెస్ కల్లిస్, రాహుల్ ద్రవిడ్ , బ్రియాన్ లారా మాత్రమే రూట్ కంటే ముందున్నారు. ఇదిలా ఉండ‌గా ఆస్ట్రేలియా గడ్డపై ఎప్పుడూ సెంచరీ చేయని జో రూట్ ఊహించ‌ని రీతిలో బ్రిస్బేన్ లో జరిగిన రెండవ యాషెస్ 2025–26 టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో అజేయంగా 138 పరుగులు చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన టెస్ట్ సీరీస్ లో ఇంగ్లండ్ 3-1 తేడాతో సీరీస్ ను కోల్పోయింది. ఇక జో రూట్ 234 ర‌న్స్ మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు.

Exit mobile version