Jishnu Dev Verma : హైదరాబాద్ – రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Verma) రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదాను కేంద్ర సర్కార్ పరిశీలన నిమిత్తం పంపించారు. ఈ సందర్బంగా కేంద్ర హోం శాఖ న్యాయ సలహాను కోరారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు వీలుగా పీఆర్ చట్ట సవరణకు సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం పైగా రిజర్వేషన్లు పెంపునకు రాష్ట్రానికి హక్కు ఉందని వెల్లడించింది.
Governor Jishnu Dev Verma – BC Reservation
పంచాయతీరాజ్ చట్టం-2018ని సవరించడంలో భాగంగా ప్రభుత్వం కీలక ముసాయిదాను తయారు చేసింది. అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఆర్డినెన్స్ ను కేంద్ర హోం శాఖకు పంపుతూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ ఆమోదానికి మరింత ఆలస్యం కానుంది. కాగా మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాల్సి ఉంది. రిజర్వేషన్ల అంశం ఓ కొలిక్కి వచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది సర్కార్.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఫుల్ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం శాసన సభలో ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్డినెన్స్ ను ఆమోదించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ కు సర్కార్ పంపించింది.
Also Read : Minister TG Bharat – AP Growth : ఏపీ కూటమి పాలన సంక్షేమానికి ఆలంబన















