Jeevan Reddy : కరీంనగర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ మీద పెత్తనం చెలాయించడం ఏంటి అంటూ నిప్పులు చెరిగారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై. ఆయనను సపోర్ట్ చేస్తున్న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని కూడా ఏకి పారేశారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. తాము ఏది చెప్పినా వినిపించు కోవడం లేదని, ఫిరాయింపు ఎమ్మెల్యే మాట వింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇంకెంత కాలం ఓపిక పట్టాలని జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడే బాగుండేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
Jeevan Reddy Slams MLA Sanjay
కావాలని రాజకీయంగానే కాకుండా తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.
కాంగ్రెసోడు అడిగితే ఒక్క పని కూడా చేయడం లేదంటూ ఫైర్ అయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ది చేస్తాం అని బోర్డు పెట్టుకున్నారా అంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ వాళ్ళకి రాజ్యం నడిపే తెలివి లేదన్నారు. మనం ఎవరితో యుద్దం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి కదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం నుండి వచ్చిన వాడు పక్కలో బల్లెంతో పొడుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ధ్వజమెత్తారు జీవన్ రెడ్డి. తాన ఇంతలా మానసిక క్షోభ అనుభవించడానికి కారణం మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి.
Also Read : Harish Rao Fired on CM Revanth : బడా బాబుల కోసం పేదల బతుకులు కూలుస్తారా..?


















