JD Lakshmi Narayana : హైదరాబాద్ – సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ (JD Lakshmi Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని గత కొంత కాలంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన కొలువు తీరిన వెంటనే విచారణకు ఆదేశించారు. ఇందు కోసం జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ను ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన కమిషన్ పూర్తి నివేదికను సమర్పించింది. ఈ నివేదికను శాసన సభలో ప్రవేశ పెట్టారు. 9 గంటలకు పైగా అసెంబ్లీలో చర్చ జరిగింది. చివరకు మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు గాను కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
JD Lakshmi Narayana Key Comments
ఇందులో భాగంగా సీబీఐకి విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని ప్రకటించారు. దీంతో దర్యాప్తు వేగవంతం కానుంది. ఈ సందర్బంగా కాళేశ్వరం విచారణ కు సంబంధించి స్పందించారు మాజీ సీబీఐ జేడీ . కాళేశ్వరం లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత్ర కూడా ఉందన్నారు. అయితే వారిని విచారించే అధికారం సీబీఐకి ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన సీబీఐ విచారణ చేపట్ట లేదన్నారు. కేంద్రం కూడా అందుకు ఒప్పుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి సెక్షన్ 5 నోటిఫికేషన్ జారీ చేస్తేనే సీబీఐ కి అనుమతి వచ్చినట్లుగా భావించాల్సి వస్తుందన్నారు జేడీ లక్ష్మీ నారాయణ.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సాధారణ అంగీకారం వల్ల సీబీఐ కేసు విచారణ చేపట్టడం సాధ్యం కాదన్నారు.సుగాలి ప్రీతి విషయంలో కూడా అదే జరిగిందన్నారు. ఏపీ రాష్ట్రం నోటిఫికేషన్ ఇచ్చినా.. కేంద్రం సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు కాబట్టే కేసు నిలిచి పోయిందన్నారు.
Also Read : CM Revanth Reddy Important Letter : సీబీఐ విచారణ కోసం కేంద్ర సర్కార్ కు లేఖ
















