Jajula Srinivas Goud Shocking Comments : తెలంగాణ ఉద్య‌మం త‌ర‌హాలో బీసీ ఉద్యమం

స్ప‌ష్టం చేసిన జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

Hello Telugu - Jajula Srinivas Goud Shocking Comments

Hello Telugu - Jajula Srinivas Goud Shocking Comments

Jajula Srinivas Goud : హైద‌రాబాద్ : తెలంగాణ ఉద్య‌మ త‌ర‌హాలో బీసీ రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు బీసీ జేఏసీ వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ (Jajula Srinivas Goud). నవంబర్ 2 న బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జ‌రుగుతుంద‌న్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇక వ‌చ్చే నెల రెండవ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా కేంద్రాలలో నిరసన దీక్షలు చేపడతామ‌ని వెల్ల‌డించారు.మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తామ‌ని ప్ర‌క‌టించారు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. 4వ వారంలో ఢిల్లీలో లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ, ప్ర‌దాన మంత్రి నరేంద్ర మోడీలను కలుస్తామ‌ని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా బీసీల పోరాటాన్ని గల్లీ నుంచి నుండి ఢిల్లీ వరకు చేపడ‌తామ‌న్నారు.

Jajula Srinivas Goud Shocking Comments on BC Reservation

బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని దశల వారీగా చేపట్టి బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధించే వరకు బిసి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చేస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చే వరకు బీసీల పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని వెల్లడించారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ విజిఆర్ నారగోని, కో చైర్మన్ దాసు సురేష్, కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణలు పాల్గొని మాట్లాడారు. బిసి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 18వ తేదీన జరిగిన రాష్ట్ర బంద్ చరిత్ర సృష్టించిందని అన్నారు. బీసీల బంద్ దేశ పాలకుల గుండెల్లో గుబులు రేపిందని, తెలంగాణ లో ఉన్న బీసీల బలమేందో , బలగమేందో దేశం మొత్తం చూసిందని ఆయన అన్నారు.

Also Read : K Kavitha Strong Demand for Arvind Resign : ధ‌ర్మ‌పురి అర‌వింద్ రాజీనామా చేయాలి

Exit mobile version