విజయవాడ : మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఇవాళ వెంకన్న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల మధ్య విద్చేషాలు రెచ్చగొట్టేలా జగన్ కుట్రలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు తనను నమ్మ లేదని, కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. అయినా బుద్ది రావడం లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేస్తానని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నియోజకవర్గ నేతలతో సమావేశాలకు జగన్ కు యేడాదిన్నర కావాలంట అంటూ ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న. ప్రజల కోసం కాకుండా కేవలం అధికార కాంక్షతోనే అడ్డగోలుగా జగన్ వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు.
పాదయాత్ర కాదు మోకాళ్ళ యాత్ర చేసినా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేడని అన్నారు బుద్దా వెంకన్న. జగన్మోహన్ రెడ్డి ఉంటే బటన్ నొక్కావాడని ఆయన కోటరీ మాత్రమే ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. జగన్ వంటి నాయకుడు మళ్ళీ రాకూడదని ప్రజలంతా చాలా బలంగా కోరుకున్నారని చెప్పారు బుద్దా వెంకన్న.అందుకనే మొన్న ఎన్నికల్లో కేవలం కొద్ది మందితో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. అమ్మ ఒడి పేరుతో ఇంట్లో కేవలం ఒక పిల్లోడికి మాత్రమే జగన్ డబ్బులు వేశాడని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నారని చెప్పారు.
