టీమిండియా దూకుడుగా ఆడ‌క‌పోతే క‌ష్టం

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఆకాష్ చోప్రా

hellotelugu_AkashChopra

ముంబై : మాజీ క్రికెట‌ర్ ఆకాష్ చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. టీమిండియా తను దూకుడును ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడాడు. ఇవాళ జ‌రిగే మ్యాచ్ తో పాటు వెస్టిండీస్ తో జ‌రిగే మ్యాచ్ అత్యంత కీల‌క‌మ‌న్నాడు. ఇదిలా ఉండ‌గా ఆకాష్ చోప్రా భారత ఎడమచేతి వాటం ఆటగాళ్లకు ఆఫ్-స్పిన్ ఛాలెంజ్, సికందర్ రజాను ఎదుర్కోవడానికి ఉన్న పద్ధతి, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుగు పరచాల్సిన ప్రాంతాలపై తన ఆలోచనలను పంచుకున్నారు .

ఆకాష్ చోప్రా జియోహాట్‌స్టార్ నిర్వ‌హించిన చ‌ర్చా వేదిక‌లో ‘గేమ్ ప్లాన్’ గురించి మాట్లాడాడు. ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ 2026లో జరిగే కీలకమైన సూపర్ 8 మ్యాచ్‌లో భారతదేశం జింబాబ్వేతో తలపడుతుంది, నికర రన్-రేట్‌ను మెరుగు పరచుకోవడానికి పెద్ద విజయం అవసరం అన్నారు టోర్నమెంట్‌లో ఆఫ్-స్పిన్నర్లు భారతదేశానికి అతిపెద్ద తలనొప్పిగా ఎలా మారారో ఆకాష్ చోప్రా హైలైట్ చేశాడు. ఆఫ్-స్పిన్నర్లు భారత ఓపెనర్లకు వేసిన ప్రతి డెలివరీ కొంచెం షార్ట్, వైడ్ , ఫైర్ ఇన్‌గా ఉంటుంద‌న్నాడు. వారు ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదన్నాడు. నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా , పాకిస్తాన్‌లపై సరిగ్గా అదే జరిగిందన్నాడు.

ఆర్యన్ దత్, సల్మాన్ అలీ అఘా లేదా ఐడెన్ మార్క్రామ్ అయినా, అందరూ భారత బ్యాటర్లపై, ముఖ్యంగా ఎడమచేతి వాటం ఆటగాళ్లపై అదే ప్రణాళికను అనుసరించారని తెలిపాడు. నిజానికి, ఈ ప్రపంచ కప్‌లో ఫింగర్ స్పిన్నర్లపై, ముఖ్యంగా ఆఫ్-స్పిన్నర్లపై భారతదేశం కంటే ఎక్కువ వికెట్లు కోల్పోయిన జట్టు లేదన్నాడు.

Exit mobile version