హైదరాబాద్ : పోలీసులకే కాదు మొత్తం సినిమా రంగాన్ని షేక్ కు గురి చేయడేమ కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, సవాల్ విసిరి చివరకు పోలీసులకు చిక్కిన ఐ బొమ్మ ఫౌండర్ , సీఈఓ ఐబొమ్మ రవి ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వయంగా ఈ విషయాన్ని కోర్టు ముందు వాపోయాడు. గురువారం కేసు విచారణలో భాగంగా పోలీసులు కస్టడీ కోసం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా తను ప్రతినిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టాడు రవి. రోజు రోజుకు కుటుంబం గడవడం కష్టంగా మారిందంటూ వాపోయాడు నాంపల్టి కోర్టు ముందు. ఇదిలా ఉండగా కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయనకు సంబంధించిన అన్ని బ్యాంక్ ఖాతాలను, ప్రాపర్టీ డిపాజిట్లను ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తన కుటుంబ పోషణ, నిత్య అవసరాలు, వైద్య ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని రవి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబ జీవనం సాగించడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి వీలుగా తన ఫ్రీజ్ అయిన బ్యాంక్ ఖాతాలలో కొన్నింటినైనా అన్‌ఫ్రీజ్ చేసేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు దీనిపై పోలీసుల వివరణ కోరింది. ఇంకా విచారణ పూర్తి కాలేదు కాబట్టి తనకు కొంత వెసులుబాటు కల్పించేందుకు అవకాశం ఉందని న్యాయవాదులు పేర్కొంటున్నారు.


















