హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేయడం కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి స్పందించారు కవిత. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. విచారణలో భాగంగా కేసీఆర్ ను విచారించడం సబబే అని స్పష్టం చేశారు. ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని చెప్పారు. ఆ విషయం తెలుసుకోకుండా బీఆర్ఎస్ శ్రేణులు ఎలా పడితే అలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
విచారణకు ఎదుర్కోవాల్సి వచ్చినపుడు ఎదుర్కోవాల్సిందే అని వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదన్నారు. తాను కూడా విచారణకు హాజరయ్యానని అన్నారు కవిత. తప్పు చేయకపోతే చేయలేదని నిరూపించు కోవాల్సిన బాధ్యత ఉందన్నారు . ఇదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఆమె మరోసారి మాజీ మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేశారు. గుంటనక్క (హరీష్) కేసును మ్యానేజ్ చేస్తున్నాడని కవిత విమర్శలు గుప్పించారు . .కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తందని ఆరోపించారు.
