Israel Iran War : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పోరు నాలుగో రోజుకు చేరుకున్నా కూడా దాని తీవ్రత మాత్రం తగ్గలేదు. మొదటగా టెహ్రాన్ నుంచి ఇజ్రాయెల్ పై దాదాపు 100కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా దాడులకు దిగింది. గగనతలం నుంచి ఇరాన్ లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది.
Israel Iran War Sensational
ఈ దాడిలో ఇరాన్‌కు (Iran) చెందిన ప్రభుత్వ మీడియా ఛానెల్ IRIB ప్రధాన కార్యాలయం లక్ష్యంగా మారింది. దాడి సమయంలో స్టూడియోలో వార్తలు చదువుతున్న మహిళా యాంకర్ ఒక్కసారిగా ప్రాణభయంతో పారిపోవడం వీడియోలో కనిపించింది. లైవ్ ప్రసారంలో న్యూస్ చదువుతున్న ఆ యాంకర్ హడావుడిగా స్టూడియో నుంచి బయటకు పరుగెత్తడం, వెంటనే స్టూడియోలో నల్లటి పొగ చుట్టుముట్టడం, శిథిలాలు పడిపోవడం వంటి దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దాడి తర్వాత కొన్ని క్షణాల్లోనే IRIB తిరిగి ప్రత్యక్ష ప్రసారాన్ని పునఃప్రారంభించింది. ఇదంతా చూసిన ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది యుద్ధ నేరానికి తలపోలేదని, శాంతికేమాత్రం గుణపాఠం కాదు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఖాయ్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు వారి దేశ ప్రజలను భయపెట్టలేవని, ఈ చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ఈ దాడుల్లో 200 మందికి పైగా ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘర్షణ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. అంతర్జాతీయ సముదాయానికి ఇది ఒక గంభీర హెచ్చరిక.
Also Read : Harish Rao Health Problem : మాజీ మంత్రి హరీష్ రావు కు అస్వస్థత















