KTR : హైదరాబాద్ – ఎంపీ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). ఓట్ల చోరీ గురించి పదే పదే ప్రస్తావిస్తున్న సదరు ఎంపీ తెలంగాణలో చోటు చేసుకున్న ఓట్ల సంగతి గురించి ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిలదీశారు. ఆయన చేసింది కూడా ఓటు చోరీ కాదా అని ప్రశ్నించారు . తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలపై రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు చేసిన అబద్దపు హామీల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాలన గాడి తప్పిందన్నారు. సీఎం కేవలం నోరు పారేసు కోవడం తప్పా రాష్ట్రానికి, ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. స్వంత ప్రచారం తప్పితే ఏముందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
KTR Slams Rahul Gandhi
తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టోలో 420 హామీలు 100 రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పారని, దీంతో నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే పత్తా లేకుండా పోయారని మండిపడ్డారు. ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పారని, తీరా 20 నెలలు గడిచినా 10 వేల పోస్టులు కూడా భర్తీ చేయలేక పోయారని ఆరోపించారు. హమీలతో గెలిచి వాటిని అమలు చేయకుండా ఉండటం ఓటు చోరీ కిందకి రాదా అని రాహుల్ గాంధీని సూటిగా నిలదీవారు కేటీఆర్. అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగులతో ముచ్చటించిన మీరు ఆనాటి నుంచి నేటి వరకు పత్తా లేకుండా పోయారంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిన మీరు ఇప్పుడు దొంగ ఓట్ల గురించి ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read : MP Gurumoorthy Sensational : రొయ్యల రైతుల రోదనలు వినండి : గురుమూర్తి

















