ముంబై : భారత జట్టు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఆట తీరుపై స్పందించాడు. గత కొంత కాలంగా పడుతూ లేస్తూ వస్తున్న శాంసన్ కు ఊహించని రీతిలో , తీవ్ర ఒత్తిళ్ల మధ్య పేలవమైన ఆటతీరు ప్రదర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక బాధ్యత కలిగిన క్రికెటర్ ఇలాగేనా ఆడేదంంటూ శాంసన్ ను ఏకి పారేశాడు ఆకాష్ చోప్రా. తను స్వంత యూట్యూబ్ చానల్ వేదికగా ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న కీవీస్ పర్యటనకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
ఈ సందర్బంగా భారత జట్టు ఒక కొత్త విధానం కారణంగా శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టిందన్నాడు ఆకాష్ చోప్రా. సంజు శాంసన్‌పై దృష్టి సారించింద ని, కానీ జట్టు అతనికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు అనిపించడం లేదన్నాడు. గణాంకాలను పోల్చి చూస్తే, ఇద్దరి ప్రదర్శన దాదాపు ఒకేలా ఉందని పేర్కొన్నాడు ఆకాష్ చోప్రా. ఆ తర్వాత, దాదాపు అనుకోకుండా ఇషాన్ కిషన్ తెరపైకి వచ్చాడని తెలిపారు. అతను అసలు ప్రణాళికలో భాగం కాదన్నారు. కానీ ఇప్పుడు అతను చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒకవేళ తిలక్ అందుబాటులోకి వస్తే, భారత్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. సంజుతోనే కొనసాగాలా లేక ప్రస్తుతం స్పష్టంగా మెరుగైన ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ను ఎంచుకోవాలా అని తేల్చుకోవాలంటూ పేర్కొన్నాడు..



















