ముంబై : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఒకటే చర్చ నడుస్తోంది భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి తను టీమిండియాకు బాధ్యతలు చేపట్టాక కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని విజయాలు మరికొన్ని వైఫల్యాలు ఉన్నాయి. కానీ తాను ఇష్టం వచ్చినట్లు ఆటగాళ్లను మార్చడం. దీంతో జట్టులో స్థిరత్వం అనేది లేకుండా పోయింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సైతం తనపై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. చివరకు ఒత్తిళ్లను తట్టుకోలేక నానా తంటాలు పడాల్సి వచ్చింది బీసీసీఐ. ఈ తరుణంలో ముంబైలోని బోర్డు కీలక సమావేశం నిర్వహించింది. పెద్ద ఎత్తున సెలెక్షన్ కమిటీ లో చర్చలు జరిగినట్లు బయటకు వార్తలు వచ్చాయి.
దినేష్ కార్తీక్ , ప్రజ్ఞాన్ ఓజాత పాటు బీసీసీఐ కార్యదర్శి సైకియా ఒక వైపు గంభీర్ , సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మరో వైపు తమకు కావాల్సిన ఆటగాళ్ల గురించి పట్టుపట్టారని, చివరకు 3-2 తేడాతో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ , చిచ్చర పిడుగు ఇషాన్ కిసన్, స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ లు జట్టులోకి వచ్చారని టాక్. ఇదే వాస్తవమని మరికొందరు మాజీ క్రికెటర్లు, అనలిస్టులు సైతం పేర్కొంటున్నారు. ఇక గంభీర్ వచ్చాక ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు సరైన చోటు కల్పించడం లేదనే విమర్శలు లేక పోలేదు. దీంతో తనను తప్పించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగతోంది. ఇందుకు సంబంధించి తన స్థానంలో లక్ష్మణ్ ను తీసుకు వస్తారని టాక్. దీనిపై బీసీసీఐ కార్యదర్శి సైకియా స్పందించారు. అదంతా ఊహాగానాలే తప్పా గంభీర్ ను తప్పించే ఆలోచన ఏదీ ఇప్పటి వరకు చేయలేదన్నాడు.



















