హైదరాబాద్ : టాలీవుడ్ అగ్రనటుడు రవితేజ ‘ఇరుముడి’ చిత్రంతో తన కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకున్నారు.ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూనే ఉంది. తాజాగా ఇది 50 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంంది. ‘మాస్ మహారాజ్’కు అద్భుతమైన పునరాగమనాన్ని అందించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. రవితేజ అభిమానులకు శుభవార్త అందించింది. ఒక అద్భుతమైన బ్లాక్‌బస్టర్ఇ రుముడి 50 రోజుల ప్రదర్శనను జరుపుకుంటోంది. ప్రజల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రం ఇది. రవితేజ కెరీర్ లో ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచి పోయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో, జి.వి. ప్రకాష్ సంగీతంతో రూపొందిన చిత్రం. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ నాన్-ఇంగ్లీష్ సినిమాల విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.
కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే ఈ సినిమా 31వ రోజే రూ. 250 కోట్ల క్లబ్‌లో చేరింది; అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కావడంతో థియేటర్ల వద్ద వసూళ్ల వేగం తగ్గింది. ఈ చిత్రం 50 రోజుల్లోనే రూ. 255 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద 619.11% లాభాన్ని ఆర్జించింది. తద్వారా 2026లో అత్యధిక లాభం పొందిన రెండవ చిత్రంగా ఇది నిలిచింది. 947.75% లాభంతో నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగ ఒక రాజు’ మొదటి స్థానంలో ఉంది. ‘ఇరుముడి’ కథ విషయానికొస్తే రవితేజ ఇందులో ‘త్రినాథ్’ అనే మధ్యతరగతి తండ్రి పాత్రలో అందరినీ ఆకట్టుకున్నారు. సినిమాలో మొదట విపరీతమైన మద్యపానం అలవాటు ఉన్న వ్యక్తిగా కనిపించినప్పటికీ, తన కూతురి కోసం ఆయన తన ప్రవర్తనను మార్చుకుంటారు. అంతేకాకుండా కుటుంబం కోసం తనను తాను పూర్తిగా తీర్చిదిద్దుకునే క్రమంలో 41 రోజుల పవిత్రమైన అయ్యప్ప దీక్షను చేపడతారు.
అయ్యప్ప దీక్ష , శబరిమల యాత్ర ఆయన ప్రవర్తనలో సానుకూల మార్పును తీసుకు వస్తాయి. ఇలా తన కూతురి కోసం మారడమే కాకుండా, ఒక ప్రమాదకరమైన కుట్ర నుండి అనేకమంది యువతులను ఆయన కాపాడతారు. బేబీ నక్షత్ర , కథానాయిక ప్రియా భవాని శంకర్ల అద్భుతమైన నటన కూడా కథకు మరింత లోతును చేకూర్చాయి.
