ఇర్పాన్ ప‌ఠాన్ షాకింగ్ కామెంట్స్

సంజూ శాంస‌న్ ఓపెన‌ర్ గా వ‌ద్దు

hellotelugu-IrfanPathan

ముంబై : భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇవాళ అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. టీమిండియా వ‌ర్సెస్ భార‌త్ మ‌ధ్య సూప‌ర్ -8 లో భాగంగా జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా ఇవాల్టి మ్యాచ్ పై స్పందించాడు. భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు స‌రైన రీతిలో ఆడ‌డం లేదని, ఈ స‌మ‌యంలో కీల‌క‌మైన ఆట‌గాళ్ల‌ను ప‌క్క‌న పెట్ట‌క త‌ప్ప‌డం లేద‌న్నారు. సంజు సామ్సన్‌ను తిరిగి జట్టులోకి తీసుకు రావాల‌ని సూచించాడు. కానీ అతన్ని ఓపెనింగ్‌గా చేయించ వ‌ద్ద‌ని పేర్కొన్నాడు. అతన్ని మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయనివ్వాల‌ని స్ప‌ష్టం చేశాడు ఇర్ఫాన్ ప‌ఠాన్.

అతను IPLలో 3వ స్థానంలో బాగా రాణించాడు, ఆసియా కప్ సమయంలో సహా భారతదేశం తరపున మిడిల్ ఆర్డర్‌లో కూడా అతను ఆ స్థానాన్ని సమర్థవంతంగా నిర్వహించడం మనం చూశామన్నాడు ఇర్ఫాన్ ప‌ఠాన్. నం. 3 పాత్ర దాదాపు ఆధునిక క్రికెట్‌లో ఓపెనర్ స్థానం లాంటిదన్నాడు. ఒక‌వేళ సంజూ సామ్సన్ ఆడకపోతే, సూర్య మూడవ స్థానంలో రావాలని పేర్కొన్నాడు ఇర్ఫాన్ ప‌ఠాన్. కానీ ఆదర్శంగా, జట్టు సంజు సామ్సన్‌కు మద్దతు ఇవ్వాలని అన్నాడు. ఆ ప్లేస్ లో కుడిచేతి వాటం బ్యాట‌ర్ గా ఆడితే టీం స్కోర్ పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు.

Exit mobile version