Iran vs Israel Attack : ఐక్యరాజ్యసమితిలో అమెరికాను హెచ్చరించిన ఇరాన్

ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దంటూ అమెరికాను పదే పదే సూచించినట్లు వివరించారు...

Hello Telugu - Iran vs Israel Attack

Hello Telugu - Iran vs Israel Attack

Iran : ఇరాన్‌లో కీలక అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. ఈ దాడులతో దౌత్య సంబంధాలను అమెరికా నాశనం చేస్తుందని మండిపడింది. అయితే అమెరికా వ్యవహారాన్ని ఎప్పుడు ఏం చేయాలనేది తమ దేశ సైన్యం చూసుకుంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన చర్యలు చేపడుతుందని వివరించింది. ఆదివారం ఇరాన్‌లోని ముఖ్య అణు స్థావరాలు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌‌పై అమెరికా (America) వైమానిక దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో అంతర్జాతీయ శాంతి, భద్రతకు పొంచి ఉన్న ముప్పు అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇరాన్ రాయబారి అమిర్ సయ్యద్ ఇర్వానీ మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దంటూ అమెరికాను పదే పదే సూచించినట్లు వివరించారు.

Iran vs Israel Attack

జూన్ 13, జూన్ 21వ తేదీల్లో ఇరాన్‌పై ఇజ్రాయెల్ (Israel), యూఎస్ నిర్వహించిన దాడులను ఈ సందర్భంగా ఇర్వానీ ఖండించారు. ఈ రెండు దేశాలు అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించాయని మండిపడ్డారు. యూఎస్, బ్రిటన్, ఫ్రాన్స్‌తోపాటు యూరోపియన్ యూనియన్‌లు రాజకీయ, చట్టవిరుద్ధంగా ప్రేరేపించిన చర్యల ఫలితంగా అవి జరిగాయని పేర్కొన్నారు. దౌత్య మార్గాలను ఇజ్రాయెల్ నాశనం చేస్తుందని విమర్శించారు. దౌత్యాన్ని నాశనం చేయాలని ఆ దేశం కంకణం కట్టుకుందంటూ ఇజ్రాయెల్‌పై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అనుసరిస్తున్న వైఖరిపై ఇర్వానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌత్య సంబంధాలును అమెరికా నాశనం చేయాలని నిర్ణయించుకుందని గత వారం పలు యూరోపియన్ సభ్య దేశాలతో ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చర్చల్లో స్పష్టమైందని తెలిపారు. అలాంటి వేళ.. ఈ పరిస్థితిని ముగింపు ఎక్కడని ఇర్వానీ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

మరోవైపు దేశంలోని అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన వెంటనే ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ స్పందించారు. ఆ క్రమంలో ఇజ్రాయెల్‌పై ఆయన నిప్పులు చెరిగారు. కానీ అమెరికాపై ఆయన పల్లెత్తు మాట కూడా మట్లాడ లేదన్న విషయం తెలిసిందే. కానీ అమెరికాలోని ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ రాయబారి ఇర్వానీ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Also Read : Marco Rubio Shocking : ఇరాన్ తో సంప్రదింపులకు చైనా సాయం కోరిన అమెరికా

Exit mobile version