ఇరాన్ దారికొస్తే స‌రి లేక‌పోతే దాడులు త‌ప్ప‌వు

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

hellotelugu-DonaaldTrump

అమెరికా : ఇరాన్ పై మ‌రోసారి యుద్దం ఆపేది లేదంటూ ప్ర‌క‌టించారు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. టెహ్రాన్‌పై జరిపిన భీకర దాడుల్లో ఇరాన్‌ టాప్‌ మిలిటరీ లీడర్లు చాలామంది చనిపోయారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీనికి సంబంధించి దాడుల వీడియోను తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. 48 గంటల్లోగా హర్మూజ్‌ను తెరవడమో లేదా ఒప్పందానికి రావాలని ట్రంప్‌ అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే విధ్వంసకర పరిణామాలు ఉంటాయన్నారు. ఈ హెచ్చరికల అనంతరమే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా ఇరాన్ నుండి F15 జెట్ సిబ్బందిని అమెరికా ఎలా రక్షించింద‌నే దానిపై కూడా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది యుఎస్. గల్లంతైన ఫైటర్ జెట్ సిబ్బందిని తిరిగి తీసుకు రావడానికి, ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక ఆయుధాలతో కూడిన డజన్ల కొద్దీ విమానాలను అమెరికా సైన్యం పంపింది. తాము అత‌డిని ప‌ట్టుకున్నామ‌ని ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు. డజన్ల కొద్దీ విమానాలను సైన్యం పంపడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. కాగా ఇరాన్ అమెరికాకు చెందిన రెండు సీట్ల F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. అందులో ఒక పైలట్, ఒక వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ ఉన్నారు. పైలట్‌ను రక్షించగా, వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ గల్లంతైనట్లు సమాచారం.

Exit mobile version