Iphone 17 : అమెరికా : ఎట్టకేలకు ఊరిస్తూ వచ్చిన ప్రముఖ దిగ్గజ సంస్థ ఆపిల్ ఐఫోన్ 17 న్యూ మోడల్ ఫోన్ ను లాంచ్ చేసింది. రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షల కొద్ది ఫోన్లు అమ్ముడు పోయాయి. దీనిని చేజిక్కించు కునేందుకు బారులు తీరారు మొబైల్ ఫ్యాన్స్. ఈ ఫోన్ కు ఉన్న క్రేజ్ మామూలు కాదు. దీని ప్రత్యేకతలు భిన్నంగా ఉంటాయి. ఇదే సమయంలో ఐఫోన్ 17 (Iphone 17) లాంచ్ తర్వాత ఈ ఐఫోన్ మోడల్స్‌ను ఆపిల్ నిలిపి వేసింది . ఒక రకంగా బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పక తప్పదు. ఆపిల్ సాధారణంగా మునుపటి తరం ఐఫోన్‌లను ముఖ్యంగా ప్రో మోడల్స్‌ను ఆపి వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Iphone 17 Grand Launch
ఈ సంవత్సరం అదే ట్రెండ్‌ను అనుసరిస్తుంది ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 17 (Iphone 17) సిరీస్ లాంచ్ తర్వాత, ఆపిల్ నాలుగు పాత మోడళ్లను నిలిపి వేసింది: ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ నిలిపి వేసిన వాటిలో ఉన్నాయి. ఎ16 బయోనిక్ చిప్‌తో నడిచే ఐఫోన్ 15 , ఐఫోన్ 15 ప్లస్‌లను సెప్టెంబర్ 2023లో ప్రవేశ పెట్టగా, ఎ18 ప్రో చిప్‌ను కలిగి ఉన్న ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ గత సంవత్సరం ప్రారంభించబడ్డాయి.
ఐఫోన్ 16 , ఐఫోన్ 16 ప్లస్ భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులకు మరింత సరసమైన ఎంపికను అందిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ను భారతదేశం, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యుకె, దుబాయ్, వియత్నాంలలో సెప్టెంబర్ 9న విడుదల చేసింది. ఇందులో ఆపిల్ నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్. నాలుగు మోడళ్లు 256GB నిల్వతో ప్రారంభమవుతాయి .
అదనంగా కంపెనీ ఎయిర్‌పాడ్స్ ప్రో 3, ఆపిల్ వాచ్ సిరీస్ 11, ఆపిల్ వాచ్ SE 3, ఆపిల్ వాచ్ అల్ట్రా 3 లను ప్రవేశ పెట్టింది. కొత్త ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 12 నుండి ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుంది, అధికారిక అమ్మకాలు సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమవుతాయి.
Also Read : Chinta Mohan Fired on CM Chandrababu : ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు



















