Injeti Srinivas Growth – NSE Chairman : ఎన్ఎస్ఈ చైర్మన్ గా ఒడిశా కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి

మంగళవారం (సెప్టెంబర్‌ 9, 2025) నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది.

Hello Telugu - Injeti Srinivas Growth - NSE Chairman

Hello Telugu - Injeti Srinivas Growth - NSE Chairman

Injeti Srinivas : ఒడిశా కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ (IFSCA) మాజీ వ్యవస్థాపక చైర్మన్‌ ఇంజేటి శ్రీనివాస్‌ను (Injeti Srinivas) నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) చైర్మన్‌గా నియమించారు. మంగళవారం (సెప్టెంబర్‌ 9, 2025) నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది.

Injeti Srinivas Appionted as a NSE Chairman

గత రెండు సంవత్సరాలుగా ఎన్‌ఎస్‌ఈకి చైర్మన్‌ లేని పరిస్థితిలో, సంస్థ తొలి పబ్లిక్‌ ఇష్యూ (IPO)కు సిద్ధమవుతున్న సమయంలో శ్రీనివాస్‌ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఆయన ఎన్‌ఎస్‌ఈలో పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ డైరెక్టర్‌గా చేరారు.

నాలుగు దశాబ్దాల అనుభవం
ఇంజేటి శ్రీనివాస్‌ గతంలో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా సేవలందించారు. కార్పొరేట్‌ వ్యవహారాలు, ఆర్థిక నియంత్రణలు, పారిశ్రామిక ప్రోత్సాహం, కార్పొరేట్‌ దివాలా చట్టం, కాంపిటీషన్‌ చట్టం, చార్టెడ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ వంటి అనేక రంగాల్లో ఆయనకు 40 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

విద్యా ప్రస్థానం, సేవా ప్రారంభం
శ్రీనివాస్‌ ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి బీఏ (హానర్స్‌) పూర్తిచేసి, 1983లో ఒడిశా కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో పలు కీలక బాధ్యతలు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read : Today Gold Price : ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన పసిడి ధరలు

Exit mobile version