Gautam Gambhir : హైదరాబాద్ : స్వదేశంలో జరిగిన టెస్టు సీరీస్ ను దక్షిణాఫ్రికాతో టీమిండియా కోల్పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా ఎప్పుడైతే భారత జట్టుకు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ను నియమించడం, ఆయన ఒంటెద్దు పోకడ పోవడం, అడ్డగోలుగా ఆటగాళ్లను ఎంపిక చేయడం పట్ల సర్వత్రా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు మండి పడుతున్నారు. కేరళ స్టార్ సంజూ శాంసన్ ఫామ్ లో ఉన్నప్పటికీ తనను ఎంపిక చేయక పోవడం పట్ల నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో ఆటగాళ్లను మార్చడం కూడా విమర్శలకు దారి తీసేలా చేసింది. పుజారా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఇప్పటికే అందుబాటులో ఉండగా అనుభవం లేని ఆటగాళ్లను ఎంచుకోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
Gautam Gambhir Sensational
దేశీయ, రంజీ ప్రదర్శనల కంటే ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంచుకోవడం కూడా ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. నిర్దిష్ట బ్యాట్స్‌మెన్, బౌలర్ల కంటే చాలా ఎక్కువ ఆల్ రౌండర్లను ఎంపిక చేయడం పట్ల మండిపడుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో ఆటగాళ్ల స్థానాన్ని మార్చడం కూడా ఓటమికి కీలకంగా మారందంటున్నారు. జట్టులో రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ ఇప్పటికే ఉన్నప్పుడు వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేయడం కూడా బిగ్ మిస్టేక్ అంటున్నారు.25 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్‌ను భారత్ కోల్పోవడం క్షమించరాని నేరంగా పేర్కొంటున్నారు క్రికెట్ అభిమానులు. మొత్తంగా గౌతం గంభీర్ హెడ్ కోచ్ గా పనికి రాడంటున్నారు. తనతో పాటు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ను కూడా తప్పించాలని పట్టు పడుతున్నారు.
Also Read : DY CM Pawan Kalyan Strong Focus : కొబ్బరి రైతులకు అండగా ఉంటాం : పవన్ కళ్యాణ్


















